‘ఆర్టీసీ ప్రైవేటీకరణకు సర్కార్ కుట్ర’
TG: HYDలో జరిగిన భగీరథ మహర్షి జయంతి వేడుకల్లో బీజేపీ చీఫ్ రాంచందర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీని పూర్తిగా ప్రైవేటీకరణ చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. సర్కార్ తన మొండి వైఖరిని వీడి, కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్మికుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు సరికాదని ఆయన ఈ సందర్భంగా హితవు పలికారు.