VIDEO: గ్యాస్ సిలిండర్ లీక్ కారణంగా మంటలు

VIDEO: గ్యాస్ సిలిండర్ లీక్ కారణంగా మంటలు

RR: చేవెళ్ల మండలం దుద్దాగు గ్రామంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. గ్రామానికి చెందిన వెంకటయ్య అనే వ్యక్తి నివాసంలో గ్యాస్ సిలిండర్ లీక్ కావడంతో మంటలు చెలరేగాయి. స్థానికులు, కుటుంబసభ్యులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగక పోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.