కాచిగూడ రైల్వే స్టేషన్‌లో త్రివర్ణ దీపాల వెలుగు

HYD: ఆపరేషన్ సింధూర్ విజయోత్సవాన్ని పురస్కరించుకుని కాచిగూడ రైల్వే స్టేషన్‌ను త్రివర్ణ పతాక రంగుల వెలుగులతో అలంకరించారు. దేశ ఐక్యతను ప్రతిబింబించేలా ఈ దీపాల కాంతి ప్రజల మనసులను హత్తుకుంటోంది. దేశ రక్షణ కోసం పనిచేసిన వీరులకు కృతజ్ఞతగా నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రజలలో గర్వాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపింది.