ఈ నెల 22న ఫుట్‌బాల్, బక్సింగ్ పోటీలు
PLD: శాప్ లీగ్స్‌లో భాగంగా ఈ నెల 22న సరసారావుపేటలో జిల్లాస్థాయి అండర్-15, 21 విభాగంలో ఫుట్‌బాల్, అండర్-15, 19 విభాగంలో బాక్సింగ్ పోటీలు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి నరసింహా రెడ్డి తెలిపారు. ఇందులో పాల్గొనే వారు శాప్ వెబ్‌సైట్లో వివరాలు ఓపెన్ రిజిస్ట్రేషన్ ద్వారా నమోదు చేసుకోవాలన్నారు. ఈ నెల 21 రాత్రి 12 లోపు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు అర్హులన్నారు.