VIDEO: ముక్దుంపూర్‌లో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్
KMR: మహమ్మద్ నగర్ మండలంలోని ముక్దుంపూర్ గ్రామంలో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుంది. యువకులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ.. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటును తప్పక వినియోగించుకోవాలని కోరారు. గ్రామంలో ఉదయం నుంచే గ్రామస్తులు ఓటు వేస్తున్నారు.