అగ్ని ప్రమాదం.. పొగాకు బ్యారన్ దగ్ధం

అగ్ని ప్రమాదం.. పొగాకు బ్యారన్ దగ్ధం

BDK: అశ్వారావుపేట మండలం నల్లపాడు గ్రామంలో సోమవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పొగాకు రైతులు ఎంతో శ్రమించి సాగు చేసుకున్న పంటను ఆరబెట్టే 'పొగాకు బ్యారన్' అకస్మాత్తుగా అగ్నికి ఆహుతైంది. బ్యారన్‌లోని పొగాకును ఆరబెడుతున్న సమయంలో మంటలు చెలరేగాయి. ఏడాది పొడవునా పడిన కష్టం కళ్లముందే బూడిదవ్వడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.