పేరయ్య చెరువు పూడిక తీత పనులకు శ్రీకారం

KKD: పిఠాపురం నియోజకవర్గం నాగులపల్లిలో కలుషితమైన పేరయ్య చెరువు పూడికతీత పనులను ఆదివారం గ్రామ సర్పంచ్ గౌరీ రాజేశ్వరి ప్రారంభించారు. చెరువు వ్యర్థాలతో నిండి దుర్వాసన వస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా, సర్పంచ్ పూడికతీత పనులకు శ్రీకారం చుట్టారు.