VIDEO: రైతులకు న్యాయ సహాయం, చట్టాలపై అవగాహన
మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల కేంద్రంలో సాగు న్యాయ యాత్ర పేరుతో రైతులకు వ్యవసాయ మార్కెట్, భూశాస్త్ర, వ్యవసాయ చట్టాలపై సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ & రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు భూమి సునీల్ ముఖ్యంగా హాజరై రైతులకు న్యాయ సహాయం, చట్టాలను ఉపయోగించే మార్గాలను వివరించారు.