'ప్రజా సంక్షేమమే ప్రభుత్వం ధ్యేయం'

'ప్రజా సంక్షేమమే ప్రభుత్వం ధ్యేయం'

SKLM: ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వం ధ్యేయమని ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు అన్నారు. గురువారం రాత్రి జి.సిగడాం మండలం జగన్నాథవలసలో ఎమ్మెల్యే పర్యటించారు. ఈ మేరకు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానిక ప్రజలతో మాట్లాడి గ్రామంలో ఉండే సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే, ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.