VIDEO: అభ్యర్థులను బెదిరిస్తున్నారు: మాజీ ఎంపీ
MLG: ములుగు మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం బీజేపీ మాజీ ఎంపీ సీతారాం నాయక్ పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 'ఓటమి భయంతో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను బెదిరిస్తోంది. బీజేపీకి పట్టం కడితే ములుగు పట్టణాన్ని అభివృద్ధి చేస్తాం. ములుగులో బీఆర్ఎస్ కనుమరుగైపోయింది' అన్నారు. అలాగే, ఈ నెల 8న జిల్లాకు ఈటల రాజేందర్ రానున్నట్లు తెలిపారు.