ఉత్తమ సేవకు డాక్టర్ శ్రావణ్‌కు ప్రశంసాపత్రం

ఉత్తమ సేవకు డాక్టర్ శ్రావణ్‌కు ప్రశంసాపత్రం

KNR: శంకరపట్నం మండల వైద్యాధికారి డాక్టర్ శ్రావణ్ కుమార్ తన ఉత్తమ సేవలకు గాను ప్రశంసాపత్రం అందుకున్నారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా వైద్య అధికారి డా. వెంకటరమణ ఈ ప్రశంసాపత్రాన్ని అందజేశారు. PHCలో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచడం, రోజువారీ ఓపీని వృద్ధి చేయడంతో అవార్డు అందుకున్నారు.