బాలుర అదృశ్యం సుఖాంతం.. SP అభినందన

బాలుర అదృశ్యం సుఖాంతం.. SP అభినందన

KMR: ఇద్దరు బాలుర అదృశ్యం కేసును బీర్కూర్ పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు. వివరాల్లోకి వెళితే.. బీర్కూర్ జ్యోతిబాఫూలేలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు 7వ తేదీన రాత్రి 9 గం.ల నుంచి కనిపించకుండా పోయారు. 8న సాయంత్రం కుటుంబ సభ్యులు PSలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగి వారిని గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు.