విద్యుత్ అధికారులతో ఎమ్మెల్యే సమావేశం

విద్యుత్ అధికారులతో ఎమ్మెల్యే సమావేశం

ATP: తాడిపత్రి పట్టణంలో జెసి స్వగృహం నందు ఎమ్మెల్యే జెసి అస్మిత్ రెడ్డి తాడిపత్రి, యాడికి, పెద్దవడుగూరు, పెద్దపప్పూరు మండలాలలోని  విద్యుత్ సరఫరాపై అధికారులతో శనివారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం రైతులకు తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ సరఫరా ఖచ్చితంగా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. పట్టణంలో విద్యుత్ సరఫరా కోతలు లేకుండా చూడాలని సూచించారు.