అయ్యప్ప గుట్టలో ఘనంగా సుబ్రహ్మణ్య షష్టి వేడుకలు

అయ్యప్ప గుట్టలో ఘనంగా సుబ్రహ్మణ్య షష్టి వేడుకలు

Jgl: కోరుట్ల పట్టణంలోని అయ్యప్ప గుట్టలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో బుధవారం సుబ్రహ్మణ్య షష్టి వేడుకలు వైభవంగా జరిగాయి. ఆలయ శాశ్వత గౌరవ అధ్యక్షులు చిద్రాల నారాయణ స్వామి ఆధ్వర్యంలో సుబ్రహ్మణ్య స్వామికి సామూహిక పంచామృత అభిషేకాలు, ప్రత్యేక పూజలు, కళ్యాణ వేడుకలు భక్తుల సమక్షంలో నిర్వహించారు. ఈ క్రమంలో ఆలయానికి వచ్చిన భక్తులకు, అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు.