విద్యార్థుల ప్రతిభకు గిన్నిస్ రికార్డు

విద్యార్థుల ప్రతిభకు గిన్నిస్ రికార్డు

E.G: తాళ్లపూడి మండలం తాళ్లపూడిలోని సెయింట్ యూజిన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు మరో రికార్డ్ సృష్టించారు. 300 మంది విద్యార్థులు 100 నిమిషాల్లో 300 ఇన్నోవేషన్స్ పూర్తి చేయడంతో గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు గిన్నిస్ రికార్డు సర్టిఫికేట్లు అందించారు.