INSPIRATION: మొరార్జీ దేశాయ్
భారతదేశ తొలి కాంగ్రెసేతర ప్రధాని మొరార్జీ దేశాయ్ ఆదర్శప్రాయుడు. స్వాతంత్ర్య పోరాటం కోసం డిప్యూటీ కలెక్టర్ పదవినే త్యజించిన గొప్ప దేశభక్తుడు. భారతరత్నతో పాటు పాక్ అత్యున్నత పౌర పురస్కారం 'నిషానే పాకిస్తాన్' పొందిన ఏకైక భారతీయుడు ఆయనే. 81 ఏళ్ల వయసులో ప్రధానిగా బాధ్యతలు చేపట్టి, క్రమశిక్షణతో కూడిన పరిపాలనను అందించారు. ఆయన జీవితం నేటికీ అందరికీ స్ఫూర్తిదాయకం.