మంత్రిని కలిసిన మార్కెట్ కమిటీ ఛైర్మన్
SDPT: రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని గజ్వేల్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై మంత్రి వారికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ అభివృద్ధి, రైతులకు కల్పించాల్సిన మెరుగైన సౌకర్యాలపై మంత్రితో చర్చించారు.