మెకానిక్ షెడ్ నిర్మాణానికి శంకుస్థాపన

KMM: ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలో నూతన మెకానిక్ షెడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నగర మేయర్ పునుకొల్లు నీరజ శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. మున్సిపల్ కార్యకలాపాలకు అవసరమైన సదుపాయాలను మెరుగుపరచడంలో భాగంగా ఈ నిర్మాణం చేపడుతున్నట్లు పేర్కొన్నారు.