'నీటి నిల్వలు ఉండేలా చర్యలు తీసుకోవాలి'

TPT: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 02 వరకు జరగనున్న నేపథ్యంలో, భక్తులకు అసౌకర్యం కలగకుండా నీటి నిల్వలు సమృద్ధిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మంగళవారం అధికారులను ఆదేశించారు. తిరుమల, తిరుపతి ప్రాంతాలలోని అన్ని డ్యామ్‌లలో నీటి లభ్యత, వినియోగంపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు.