VIDEO: దేవరాజ వాహనంపై ఉరేగిన శ్రీనివాసుడు
WGL: రాయపర్తి మండలం సన్నూరులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారి కళ్యాణ మహోత్సవం భక్తిశ్రద్ధల మధ్య కన్నుల పండుగగా జరిగింది. సోమవారం దేవరాజ వాహనంపై ఉరేగుతూ శ్రీనివాసుడు భక్తులకు వైభవంగా దర్శనమిచ్చారు. భక్తులు ఆలయ ప్రాంగణాన్ని నిండుగా భక్తిగీతాలతో మార్మోగించగా, ఈ ఘనోత్సవం స్థానిక ప్రజలకు ఒక అద్భుత అనుభవంగా నిలిచింది.