నేడు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం
అన్నమయ్య: జిల్లా రాయచోటి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఈ నెల 8న నిర్వహించనున్నట్లు MPDO అరుంధతి తెలిపారు. ఈ సమావేశంలో గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్యంపై సమీక్షతో పాటు వైద్య ఆరోగ్యశాఖ, పశువైద్య శాఖ, ఉపాధి హామీ, గృహ నిర్మాణం, విద్యుత్, విద్యాశాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖల పనితీరును పరిశీలించనున్నారు.