పార్టీ నేతల అరెస్టు ఖండించిన బీజేపీ చీఫ్

పార్టీ నేతల అరెస్టు ఖండించిన బీజేపీ చీఫ్

HYD: బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావును మొయినాబాద్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. బీజేపీ నేతలు సచివాలయాన్ని ముట్టడించిన నేపథ్యంలో పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. బీజేపీ నేతల అరెస్ట్‌ను రాంచందర్ రావు ఖండించారు. అక్రమ అరెస్టులతో ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవాలని చూస్తోందని ఆరోపించారు. అరెస్ట్ చేసిన బీజేపీ నేతలను వెంటనే విడుదల చేయాలని బీజేపీ చీఫ్ డిమాండ్ చేశారు.