ఎడతెరిపిలేని వర్షం..కొనుగోలు కేంద్రాల్లో తడిచిన ధాన్యం
NLG: కట్టంగూర్ మండలంలో గురు, శుక్రవారాల్లో కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిచి ముద్దయింది. మునుకుంట్ల, కల్మెర, నారెగూడెం, పరడ, అయిటిపాముల, ఈదులూరు, కురుమర్తి, బొల్లెపల్లి గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం కుప్పలు వర్షానికి తడిచిపోయాయి. దీంతో ఆయా గ్రామాల రైతులు ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేయాలని కోరుతున్నారు.