INSPIRATION: అబ్రహం లింకన్
అబ్రహం లింకన్ తన జీవితంలో అనేకసార్లు ఘోర వైఫల్యాలను చవిచూశారు. వ్యాపారంలో విఫలమయ్యారు. 8 సార్లు ఎన్నికలలో ఓడిపోయారు. నాడీ సంబంధిత రుగ్మతలతో బాధపడ్డారు. అయినప్పటికీ, ఎప్పుడూ తన లక్ష్యాన్ని వదలలేదు. పట్టుదలతో కృషి చేసి US అధ్యక్షుడిగా ఎన్నికై.. దేశంలో బానిసత్వాన్ని రద్దు చేశారు. పదే పదే ఓటములు ఎదురైనా, లక్ష్యంపై విశ్వాసం ఉంటే విజయం సాధించవచ్చని ఆయన జీవితం నిరూపించింది.