క్రికెట్ బెట్టింగ్‌లపై ఎస్పీ ఉక్కుపాదం: ఎస్పీ
సత్యసాయి: ఐపీఎల్ నేపథ్యంలో క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా బెట్టింగ్ ముఠాలపై ప్రత్యేక నిఘా ఉంచామని, జూదానికి పాల్పడే వారిపై కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. యువత ఈ వ్యసనానికి బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలని సూచించారు.