కష్టకాలంలో అండగా ప్రమాద బీమా: ఎమ్మెల్యే

NRML: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఇస్తున్న ఇందిరా మహిళా శక్తి ప్రమాద బీమా కష్టకాలంలో అండగా ఉంటుందని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. కుబీర్‌కు చెందిన బొడ్డు యశోద పాము కాటుతో మృతి చెందడంతో మృతురాలి భర్తకు మంజూరైన ప్రమాద బీమా రూ.10లక్షల చెక్కును ఎమ్మెల్యే మంగళవారం అందజేశారు. మహిళలు తప్పనిసరిగా సహాయక సంఘాల్లో సభ్యత్వం తీసుకోవాలన్నారు.