'ప్రజలకు త్రాగునీటి సమస్యలు లేకుండా చూడాలి'
NLR: కొడవలూరు ఎంపీడీవో కార్యాలయంలో శనివారం గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారులు, గ్రామపంచాయతీ కార్యదర్శులతో ఎంపీడీవో వెంకటసుబ్బారావు సమీక్ష చేశారు. ఈ సమావేశంలో ప్రజలకు త్రాగునీటి సమస్యలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. స్థానిక ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకుని పరిపాలన సాగించాలని కోరారు.