పేకాట స్తావరంపై పోలీసుల దాడులు

పేకాట స్తావరంపై పోలీసుల దాడులు

MLG: ములుగు మండలం దేవగిరిపట్నం గ్రామ శివారులో పేకాట ఆడుతున్న ఏడుగురిని ములుగు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆకస్మిక దాడులు నిర్వహించామని, దాడుల్లో జూదగాళ్ల వద్ద రూ.23,600 నగదు, 5 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు ములుగు ఎస్సై ఉపేందర్రావు తెలిపారు. దాడుల్లో ములుగు రెండవ ఎస్సై బీ.చంద్రశేఖర్, సివిల్, టీజీఎస్పీ సిబ్బంది పాల్గొన్నారు.