ఇద్దరు వార్డెన్‌ల సస్పెండ్‌కు కలెక్టర్ ఆదేశం
BDK: భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ నిన్న ఇల్లందులో తనిఖీలు చేపట్టారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో అంబులెన్స్ నిర్లక్ష్యంపై విచారణకు ఆదేశించారు. అనంతరం వసతి గృహాలను పరిశీలించగా.. మెనూ పాటించకపోవడం, విధులకు గైర్హాజరు కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన ఇద్దరు వార్డెన్లను తక్షణమే సస్పెండ్ చేయాలని ఆదేశించారు.