ఎన్నికల సిబ్బందికి సూచనలు చేసిన అదనపు కలెక్టర్
KMM: ముదిగొండ మండలంలో ఎన్నికల సామాగ్రి డిస్టిబ్యూషన్ కేంద్రాన్ని అదనపు కలెక్టర్ శ్రీజ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎన్నికల కేంద్రాల వద్ద ప్రత్యేక అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆమె తెలిపారు.