హుజూర్‌నగర్ ముత్యాలమ్మ జాతర తేదీలు ఖరారు

ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే అత్యంత వైభవంగా జరిగే హూజూర్‌నగర్ ముత్యాలమ్మ జాతర తేదీలు ఖారయ్యాయి. ముత్యాలమ్మ గుడుల పునర్నిర్మాణ కమిటీ, జాతర కమిటీ ఏర్పాటు సమావేశంలో పట్టణ పెద్దలు ఈ తేదీలు ఖరారు చేశారు. 17/08/2025 ముసలి ముత్యాలమ్మ (చర్ల పోచమ్మ), 18న వయసు ముత్యాలమ్మ (మూడు గుండ్ల ముత్యాలమ్మ), 21న శ్రీ కనకదుర్గమ్మ జాతర జరగనుంది. జాతర ఈ నెల 14న చల్లకుండ ఎత్తే కార్యక్రమంతో ప్రారంభమవుతుంది.