రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి: అనగాని

రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి: అనగాని

AP: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. తాగునీటితో పాటు ఆయా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు ఆటంకం కలగకుండా చూడాలని పేర్కొన్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన పంట వివరాలు సేకరించాలని తెలిపారు.