'సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి'

ADB: అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని బేల తాహసీల్దార్ కోట్నాక్ రఘునాథరావు అన్నారు. సోమవారం బేల మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఉపాధ్యక్షులు సామ రూపేష్ రెడ్డితో కలిసి మండలంలోని పిట్గావ్, సాంగిడి గ్రామల లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.