నేటి నుంచి 'నో డ్రోన్ జోన్' అమలు: పోలీసులు

నేటి నుంచి 'నో డ్రోన్ జోన్' అమలు: పోలీసులు

విశాఖ: నేటి నుంచి ఈ నెల 16 తేదీ వరకు విశాఖలోని కాన్వెంట్ జంక్షన్ నుంచి ఆంధ్రా యూనివర్సిటీ గ్రౌండ్ వరకు "నో డ్రోన్ జోన్" గా పోలీసుల ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రా యూనివర్సిటీ గ్రౌండ్‌లో సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్ జరగనుండడంతో భద్రతా చర్యల్లో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నామన్నారు. నిబంధలనలు అతిక్రమించి ఎవరైన డ్రోన్ ఎగురవేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.