రూ.50 వేల వరకే నగదు అనుమతి

రూ.50 వేల వరకే నగదు అనుమతి

WNP: ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్నందున ఎన్నికల కోడ్ ముగిసే వరకు రూ.50 వేల వరకు మాత్రమే నగదును తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుందని వనపర్తి జిల్లా ఎస్పీ సునీత రెడ్డి స్పష్టం చేశారు. సరైన పత్రాలు లేకపోయినా నగదును సీజ్ చేస్తామని హెచ్చరించారు. శాంతియుత, పారదర్శక ఎన్నికలకు ప్రతి పౌరుడు సహకరించాలన్నారు.