కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు

కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు

JN: దేవరుప్పుల మండలంలోని లక్ష్మణ్ తండాకు చెందిన 15 మంది బీఆర్ఎస్ నాయకులు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీ మారినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నల్ల శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.