' విద్యా రంగ సమస్యలను పరిష్కరించాలి '
SRD: విద్యా రంగ సమస్యలు పరిష్కరించాలని PDSU జిల్లా అధ్యక్షుడు సురేష్ డిమాండ్ చేశారు. సంగారెడ్డిలోని సంఘ భవనంలో శనివారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న ఉపకార వేతనాలను వెంటనే విడుదల చేయాలని కోరారు. ప్రభుత్వం ఉప ఎన్నికలపై చూపుతున్న శ్రద్ధ విద్యార్థులపై చూపించడం లేదని విమర్శించారు.