‘స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి’
VZM: స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాలని గజపతినగరం మాజీ శాసనసభ్యులు బొత్స అప్పల నరసయ్య కోరారు. ఇవాళ గజపతినగరంలోని వైసీపీ కార్యాలయంలో నాయకులు కార్యకర్తలతో సమావేశం జరిగింది. నియోజకవర్గ పరిధిలోగల నేతలు కార్యకర్తలకు ఇస్తున్న గుర్తింపు కార్డులు ప్రక్రియ పూర్తి కావాలన్నారు. నిత్యం ప్రజల్లో ఉండి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలన్నారు.