దివ్యాంగుల విభాగం ప్రధాన కార్యదర్శిగా నరసయ్య

దివ్యాంగుల విభాగం ప్రధాన కార్యదర్శిగా నరసయ్య

ప్రకాశం: వైసీపీ దివ్యాంగుల విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శిగా కనిగిరికి చెందిన దోసపాటి నరసయ్య ఎంపికయ్యారు. ఈ సందర్భంగా బుధవారం వైసీపీ కనిగిరి నియోజకవర్గం ఇంఛార్జ్ దద్దాల నారాయణ యాదవును నరసయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు పదవి వచ్చేలా సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. వైసీపీ బలోపేతానికి కృషి చేయాలని నరసయ్యకు నారాయణ యాదవ్ సూచించారు.