ప్రారంభమైన మార్కెట్.. ధర ఎంతంటే?

ప్రారంభమైన మార్కెట్.. ధర ఎంతంటే?

WGL: రెండు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ఈరోజు ప్రారంభమైంది. దీంతో మార్కెట్‌కు పత్తి తరలిరాగా, ధర మాత్రం గతవారం లాగే రూ.7,000లోపు ధర పలికింది. గత శుక్రవారం క్వింటా పత్తి ధర రూ.6,950లు పలకగా ఈరోజు సైతం అదే ధర పలికింది. రైతులు ఉదయాన్నే మార్కెట్‌కు సరుకు తీసుకుని రాగా క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.