400 ఏళ్లనాటి చెట్టులో ఆంజనేయుడి విగ్రహం!
రాజస్థాన్ కోటాలో ఆంజనేయ స్వామి పురాతన విగ్రహం బయటపడింది. స్థానిక దసరా మైదానంలోని దాదాపు 400 ఏళ్ల నాటి ఎండిపోయిన చెట్టును తొలగిస్తుండగా మూడున్నర అడుగుల విగ్రహం కనిపించింది. దీంతో ఆంజనేయుడి విగ్రహం చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.