VIDEO: అడ్డతీగల రోడ్డు ప్రమాదం.. ఇద్దరి పరిస్థితి విషమం

VIDEO: అడ్డతీగల రోడ్డు ప్రమాదం.. ఇద్దరి పరిస్థితి విషమం

ASR: అడ్డతీగల మండలం మిట్లపాలెం వద్ద శుక్రవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. గంగవరం నుండి అడ్డతీగల వస్తున్న ఉత్తరప్రదేశ్ రిజిస్ట్రేషన్ గల కారు అదుపుతప్పి ఒక భారీ రాయిని ఢీకొట్టింది. కారులో మొత్తం ఐదుగురు యువకులు ప్రయాణిస్తుండగా, వారిలో ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.