చిత్తూరు వన్ టౌన్ సీఐ మహేశ్వరం సస్పెండ్
చిత్తూరు వన్ టౌన్ సీఐ మహేశ్వరంను సస్పెండ్ చేస్తూ అధికారులు గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. బెట్టింగ్ నిర్వాహకుల నుంచి మామూలు తీసుకోవడమే దీనికి కారణంగా తెలుస్తోంది. నిందితులను కేసు నుంచి తప్పించడంతో పాటు.. మరికొందరిని అరెస్టు చేస్తామని బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే సస్పెండ్ జరిగినట్టు తెలుస్తోంది.