పన్నుల భారం తగ్గించాలని సీపీఎం వినతి
కర్నూలు నగర కార్పొరేషన్ చివరి కౌన్సిల్ సమావేశంలో మేయర్, మున్సిపల్ కమిషనర్‌కు ప్రజలపై పన్నుల భారం తగ్గించాలని సీపీఎం పార్టీ ప్రతినిధులు నిన్న వినతి పత్రం అందించారు. ఈ మేరకు198 జీవో ప్రకారం ప్రతి సంవత్సరం 15% పన్నులు పెంచే విధానాన్ని రద్దు చేయాలన్నారు. అలాగే వ్యాపారస్తులకు పెంచిన ట్రేడ్ లైసెన్సులను రద్దు చేయాలని CPM జిల్లా కార్యదర్శి గౌస్ దేశీ కోరారు.