మంత్రి నారాయణతో సీఆర్డీఏ కమిషనర్ భేటీ

మంత్రి నారాయణతో సీఆర్డీఏ కమిషనర్ భేటీ

GNTR: మంత్రి నారాయణను సీఆర్డీఏ కమిషనర్ విజయరామరాజు మర్యాదపూర్వకంగా కలిశారు. సీఆర్డీఏ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మంత్రిని కలవడం ఇదే తొలిసారి. రాజధానిలో జరుగుతున్న పనుల పురోగతిపై మంత్రి, కమిషనర్ సంయుక్తంగా సమీక్షించారు. ఈ సందర్భంగా సీఆర్డీఏ ఇంజినీర్లు, కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో వారు ప్రత్యేకంగా సమావేశమై పలు కీలక సూచనలు చేశారు.