'వేసవిలో మజ్జిగ, గ్లూకోజ్ నీళ్లు తాగాలి'
PLD: ఈ వేసవిలో రోజురోజుకు ఉష్ణోగ్రత మరింత పెరిగిపోతోందని, ప్రజలు ఆందోళన చెందకుండా జాగ్రత్తలు పాటించాలని క్రోసూరు పీహెచ్సీ డాక్టర్ రవికుమార్ తెలిపారు. గ్లూకోస్, మజ్జిగతో పాటు మంచినీరు అధికంగా తీసుకోవాని సూచించారు. ఉదయం 11 గంటల దాటిన తర్వాత ఎండలో సంచరించరాదన్నారు. బయటకు వెళ్లే సమయంలో రంగు దుస్తులు కాకుండా తెల్లని దుస్తులు ధరించాలని చెప్పుకొచ్చారు.