ముమ్మిడివరంలో పీస్ కమిటీలు ఏర్పాటు

ముమ్మిడివరంలో పీస్ కమిటీలు ఏర్పాటు

కోనసీమ: అంబేద్కర్ జయంతి సందర్భంగా ముమ్మిడివరం పోలీస్ స్టేషన్ పరిధిలోని గురజాపులంకలో కమిటీ సభ్యులతో ఎస్పీ రాహుల్ మీనా పీస్ కమిటీలు ఏర్పాటు చేశారు. ర్యాలీలు, సభలు శాంతియుతంగా నిర్వహించాలని తెలిపారు. అనుమతి లేకుండా భారీ గుమికూడింపులు, ర్యాలీలు నిర్వహించవద్దని సూచించారు. సౌండ్ సిస్టమ్స్, డీజేలు నిర్ణీత సమయాల్లో మాత్రమే ఉపయోగించాలని తెలియజేశారు.