వీధి కుక్కల భయం.. ప్రజలు ఆందోళన

వీధి కుక్కల భయం.. ప్రజలు ఆందోళన

JGL: వెలగటూరు మండలం అంబారిపేట గ్రామంలో వీధి కుక్కల బెడద పెరిగింది. రోడ్లపై గుంపులుగా తిరుగుతూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. పలువురు కుక్క కాటుకు గురై ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పిల్లలపై ప్రమాదం ఉండడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు అధికారులను డిమాండ్ చేస్తున్నారు.