'అర్జీల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యతనివ్వాలి'

KKD: జిల్లా ఎస్పీ బిందు మాధవ్ PGRSలో వచ్చిన అర్జీలను పరిష్కరించడానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సోమవారం తన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుని, సంబంధిత పోలీసు అధికారులతో మాట్లాడారు