స్వచ్ఛాంధ్రా దిశగా పయనిద్దాం: MLA

కోనసీమ: స్వచ్ఛ ఆంధ్రా దిశగా పయనిద్దామని మండపేటను సుందరంగా మారుద్దామని ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం మండపేట పురపాలక సంఘ కార్యాలయం వద్ద స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ స్వచ్ఛత ర్యాలీ నిర్వహించారు. మండపేట కౌన్సిల్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ముందుకు సాగుతున్నారన్నారు.